Kanchili: కంచిలి ఎంపీపీగా విమల రామారావు, వైస్ ఎంపీపీగా శారద ప్రమాణం!

Kanchili: కంచిలి మండల ప్రజా పరిషత్ ఎంపీపీగా మాదిన విమల రామారావు, వైస్ ఎంపీపీగా పైల శారద గురువారం ఎంపీడీఓ తిరుమలరావు, ఆర్ఓ అప్పలస్వామి ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 19 Nov 2026 7:33 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి ఎంపీపీగా విమల రామారావు, వైస్ ఎంపీపీగా శారద ప్రమాణం!

కంచిలి: కంచిలి మండల ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం గురువారం ఘనంగా ప్రమాణస్వీకారం చేసింది. కంచిలి ఎంపీపీగా మాదిన విమల రామారావు, వైస్ ఎంపీపీగా పైల శారద ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీడీఓ తిరుమలరావు, ఆర్ఓ అప్పలస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ మాదిన విమల రామారావు మాట్లాడుతూ..‌ "నాపై నమ్మకం ఉంచి ఎంపీపీగా అవకాశం ఇచ్చిన ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు. కంచిలి మండల అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం కల్పించేందుకు కృషి చేస్తా.

అందరితో కలిసి పనిచేస్తూ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా" అని అన్నారు. వైస్ ఎంపీపీ శారద మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. మహిళల సంక్షేమం, విద్య, వైద్యం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తా. ఎంపీపీ గారితో కలిసి మండలంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుంటా. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా" అని అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్, జనసేన ఇంచార్జీ దాసరి రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET