Srikakulam: విజయవాడ ఉత్సవ్‌కు రండి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Srikakulam: విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్-2.0కు హాజరు కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సువేందు అధికారిని ఆహ్వానించారు.
Srikakulam: విజయవాడ ఉత్సవ్‌కు రండి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2.0కు హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆహ్వానించారు.
కలకత్తా లోని సచివాలయ భవనం నబన్నా సభాఘర్ లో సువేందు అధికారిని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. విజయవాడలో నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు జరిగే విజయవాడ ఉత్సవ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా, వినోద కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా మెగా కార్నివాల్, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు, కళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు.
విజయవాడ నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా “వన్ సిటీ – వన్ సెలబ్రేషన్” భావనతో ఉత్సవ్–2.0ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ ఉత్సవ్–2.0లో సువేందు అధికారి పాల్గొని, విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి.. తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు.




