Srikakulam: పాతపట్నంలో ఘనంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు!

Srikakulam: మెలియాపుట్టి మండలంలో రూ.2.65 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును, అంగన్వాడీ భవనాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావు ప్రారంభించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 3 Oct 2026 12:58 PM IST
Srikakulam
X

Srikakulam: పాతపట్నంలో ఘనంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు!

Srikakulam: మెలియాపుట్టి మండలంలో పల్లె పండుగ 3.0 లో భాగంగా రూ.2.65 కోట్లతో నిర్మించిన టి.జి రోడ్–సంతలక్ష్మీపురం–గంగన్నపేట తారు రోడ్డు ప్రారంభించారు రూ.12 లక్షల PM-JANMAN నిధులతో కోదుకొలిగాంలో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభించారు

శంకుస్థాపన మరియు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత.

పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో PM-JANMAN పథకం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావుతో కలిసి ప్రారంభించారు.

మెలియాపుట్టి మండలంలోని టి.జి రోడ్ నుండి సంతలక్ష్మీపురం మీదుగా గంగన్నపేట వరకు రూ.2 కోట్ల 65 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు.

ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అనంతరం కోదుకొలిగాం గ్రామంలో PM-JANMAN నిధులు రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.

గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం. కృష్ణమూర్తి, మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM