Rajam: రాజాం ఆలయంలో దొంగతనం ఆభరణాలు, హుండీ నగదు అపహరణ!
Rajam: రాజాంలో కళ్యాణ గౌరీ మల్లికార్జున స్వామి ఆలయంలో దుండగుల చోరీ. అమ్మవారి బంగారు ఆభరణాలు, హుండీ నగదు అపహరణ. సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దొంగలు.
Rajam: రాజాం ఆలయంలో దొంగతనం ఆభరణాలు, హుండీ నగదు అపహరణ!
Rajam: రాజాం పట్టణంలోని మల్లికార్జున కాలనీలో ఉన్న శ్రీ కళ్యాణ గౌరీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి బంగారు బొట్టు, కనుబొమ్మలు, నత్తుతో పాటు హుండీలోని నగదును దొంగలు అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
కార్తీకమాసం ప్రారంభానికి ముందు హుండీని లెక్కించాల్సి ఉండగా, అందులో సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు ఉండొచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. చోరీ చేసిన విషయం బయటపడకుండా ఉండేందుకు ఆలయంలోని సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాల సేకరణకు క్లూస్ టీం ప్రయత్నిస్తుందని పోలీసులు తెలిపారు. ఇదే ఆలయంలో గతంలోనూ పలుమార్లు చోరీలు జరగడంతో ఆలయ భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆలయానికి భద్రత పెంచాలని కోరుతున్నారు.




