Rajam: రాజాం తొలి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే విజయం!
Rajam: రాజాంలో 21 ఏళ్ల తర్వాత జరగబోయే తొలి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని వైసీపీ ఇన్‌చార్జ్ తలై రాజేష్ ధీమా వ్యక్తం చేశారు. తగ్గదే లేదంటూ స్పష్టం చేశారు.
Rajam: రాజాం తొలి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే విజయం!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో రాజకీయ వేడి పెరుగుతోంది. 21 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజాం వైసీపీ ఇన్‌చార్జ్ తలై రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమని, ఈ విషయంలో “తగ్గేదే లేదు” అంటూ స్పష్టం చేశారు.
గత 21 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉన్న రాజాంలో.. ఎన్నికల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక పెరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్ తలై రాజేష్ పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
రాజాంలో జరగబోయే తొలి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమని తలై రాజేష్ అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విషయంలో ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాంలో వైసీపీ జెండా ఎగరేసి తీరుతామని, ఇందుకోసం పార్టీ క్యాడర్ మొత్తం సమష్టిగా పనిచేస్తుందని తలై రాజేష్ స్పష్టం చేశారు.




