Tekkali: టెక్కలి రైలు ప్రమాదం: క్షతగాత్రుడికి సింధూర పరామర్శ
Tekkali: టెక్కలి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాల్మన్ రాజును బీజేపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సింధూర పరామర్శించారు.
Tekkali: టెక్కలి రైలు ప్రమాదం: క్షతగాత్రుడికి సింధూర పరామర్శ
శ్రీకాకుళం: టెక్కలి రైలు ప్రమాదంలో 5 గురిలో నలుగురు మృతి చెందగా సాల్మన్ రాజు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న సాల్మన్ రాజ్ కుటుంబాన్ని ఆయన్ని బిజెపి పార్టీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సింధూర పరామర్శించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి, ఈ విషాద సమయంలో తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే అన్ని విధాలా మా పార్టీ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. కష్టకాలంలో ఆయా కుటుంబాలకు తోడుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ఆసుపత్రిలోనీ డాక్టర్ తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మారై స్కాన్ కూడా తీయించడం జరిగిందని ప్రస్తుతానికి ఆ అబ్బాయి కోలుకుంటున్నారని అన్నారు.
ప్రాణాపాయస్థితి లేదని కిమ్స్ వైద్యులు కూడా ధ్రువీకరించారని, అబ్బాయి రిపోర్ట్లు కూడా పరిశీలించానని డాక్టర్ సింధూర తెలిపారు. ఈ ఘటన జరగడం 4 విద్యార్థులు మృతి చెందడం చాలా దురదృష్టకరమని విచారo వ్యక్తం చేశారు.




