Tekkali: టీడీపీలో చేరినట్లు ప్రచారం అవాస్తవం: పేరాడ తిలక్
Tekkali: ఉపాధి మీటింగ్ అని చెప్పి నిమ్మాడ తీసుకెళ్లి బలవంతంగా పచ్చ కండువాలు వేశారని టెక్కలిలో సీతాపురం మహిళలు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tekkali: టీడీపీలో చేరినట్లు ప్రచారం అవాస్తవం: పేరాడ తిలక్
టెక్కలి (శ్రీకాకుళం): స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చన్నాయుడు ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. సోమవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిలక్ మాట్లాడుతూ
సీతాపురం గ్రామానికి చెందిన మహిళలను సమావేశం ఉందని చెప్పి నిమ్మాడ తీసుకెళ్లి కండువాలు వేయించారని తెలిపారు. ఈ సందర్భంగా సీతాపురం మహిళలు పెద్దలు పార్టీ కార్యాలయానికి వచ్చి తమను మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకు వెళ్లి కండువాలు వేసారని మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తోనే వైఎస్ఆర్సిపి లోనే ఉంటామని స్పష్టం చేశారు.
సీతాపురం గ్రామంలో సుమారు 200 కుటుంబాలు ఉంటే 500 కుటుంబాలు టిడిపిలో చేరాయి అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు మండిపడ్డారు,
ఈ కార్యక్రమంలో టెక్కలి జడ్పిటిసి సభ్యులు దువ్వాడ వాణి, వైఎస్ఆర్సిపి నాయకులు సత్తారు సత్యం, తమన్న గారి కిరణ్, కిల్లి అజయ్ కుమార్, బెండి ఉదయ్, కర్ణిక జీవన్ రావు, బర్ల కార్తీక్, బడ్డ రాజేష్ పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




