Pathapatnam: పాతపట్నంలో ఊపందుకున్న టీడీపీ ప్రచారం.

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి శైలాడ సతీష్, 9వ వార్డు అభ్యర్థిని మోనింగి కళ్యాణి ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 24 Nov 2026 3:31 PM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నంలో ఊపందుకున్న టీడీపీ ప్రచారం.

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో పాతపట్నం పంచాయతీ టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా శైలాడ సతీష్ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు 9వ వార్డులో మోనింగి రాజు మాతృమూర్తి అయినా మోనింగి కళ్యాణి 9 వ వార్డుకు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం భాగంగా కుమ్మర వీధి, తెలుకల వీధి, తుంబేసి పేట వీధుల్లో టిడిపి శ్రేణులతో కలిపి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి గడప తట్టి ఓటర్లను ఓటు వేసి గెలిపించమని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వీరితోపాటు టిడిపి కార్యకర్తలు నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM