Srikakulam: కంచిలి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ నేత మాదిన విమల నామినేషన్
Srikakulam: కంచిలి పెద్ద శ్రీరాంపురం MPTC అభ్యర్థిగా టీడీపీ నేత మాదిన విమల నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే అశోక్, మంత్రి రామ్మోహన్ సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు.
Srikakulam: కంచిలి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ నేత మాదిన విమల నామినేషన్
Srikakulam: కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాదిన విమల శుక్రవారం నామినేషన్ వేశారు. కంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట మండల టీడీపీ శ్రేణులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అనంతరం మాదిన విమల మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో పెద్ద శ్రీరాంపురం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేస్తామని చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పంచాయతీ ప్రజలను ఆమె కోరారు.




