Srikakulam: ఇచ్చాపురంలో ఘనంగా స్వేచ్ఛావతీ అమ్మవారి దసరా నవరాత్రులు!

Srikakulam: ఇచ్చాపురంలో శ్రీశ్రీశ్రీ స్వేచ్ఛావతీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 20 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 11 Oct 2026 11:39 AM IST
Srikakulam
X

Srikakulam: ఇచ్చాపురంలో ఘనంగా స్వేచ్ఛావతీ అమ్మవారి దసరా నవరాత్రులు!

Srikakulam: ఇచ్చాపురం పట్టణంలో వెలసిన గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ స్వేచ్ఛావతీ అమ్మవారి దసరా దేవి నవరాత్రి మహోత్సవాలు ఆదివారం (11-10-2026) అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. నేటి నుండి అక్టోబర్ 19వ తేదీ సోమవారం వరకు తొమ్మిది రోజుల పాటు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఈ నెల 20వ తేదీ మంగళవారం విజయదశమి పర్వదినం వేడుకలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

మొదటి రోజైన ఆదివారం ఉదయం నుండే ఆలయంలో విశేష పూజలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారిని మెలుకోలిపి మర్దన , అభిషేకాలుతో శాస్త్రోక్త కార్యక్రమాలు మొదలయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ సాఫీగా సాగేలా చూస్తున్నారు.

ఆలయ పూజారులు మాట్లాడుతూ... "మహిమాన్వితమైన ఈ తొమ్మిది రోజులు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొంటున్నారు" అని తెలిపారు. 'ఘనమైన ఉత్సవాల్లో పాల్గొని చల్లనితల్లి, కోర్కెలు తీర్చే కల్పవల్లి దివ్యాశీస్సులు పొంది ధన్యులు కాగలరు' అని ఆలయ నిర్వాహకులు భక్తులను కోరారు. ఉత్సవాల సందర్భంగా ఇచ్చాపురం పట్టణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram