Pathapatnam: సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి న్యాయం చేసింది: రెడ్డి శాంతి!
Pathapatnam: ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు.
Pathapatnam: సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి న్యాయం చేసింది: రెడ్డి శాంతి!
Pathapatnam: ప్రజాస్వామ్య పరిరక్షణకు సుప్రీంకోర్టు ముందుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి రెడ్డి శాంతి అన్నారు. 'ఎన్నికల సమయంలో దాడులు, దౌర్జన్యాలు, వాహనాల దహనం వంటి ఘటనలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఆధారాలతో YCP సుప్రీంకోర్టుకు వెళ్తే 19 చోట్ల తిరిగి నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబర్ 25, 2026 వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నామినేషన్ల గడువు పొడిగింపు అంశంపై కూడా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఎలాంటి రాజీ ఉండకూడదనే అంశాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసిందని ఆమె అన్నారు.




