Palakonda: పాలకొండలో మున్సిపల్ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ!

Palakonda: పాలకొండ జూనియర్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, అబ్జర్వర్ చిన రాముడు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Oct 2026 3:45 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో మున్సిపల్ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ!

పాలకొండ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పాలకొండ సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, I.A.S గారు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్రీ యస్. చిన రాముడు, I.A.S. గారితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్‌ను శనివారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

అలాగే స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్ వద్ద భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA