Veeraghattam: వీరఘట్టంలో నదిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు!
Veeraghattam: పార్వతిపురం మన్యం జిల్లా వీరఘట్టం మండலத்தில் నదిలో గల్లంతైన వ్యక్తి కోసం జరుగుతున్న గాలింపు చర్యలను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పరిశీలించారు.
Veeraghattam: వీరఘట్టంలో నదిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు!
Veeraghattam: వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన శ్రీ పాలకొండ సుబ్బారావు (62) అనే వ్యక్తి నిన్న రాత్రి సుమారు 7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు బోటు నుంచి నదిలో పడిపోయి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే గల్లంతైన వ్యక్తి కోసం చేపడుతున్న గాలింపు చర్యలను గొట్టమంగలాపురం గ్రామం వద్ద పాలకొండ సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, IAS గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది మరియు వీరఘట్టం తహశీల్దార్‌తో గాలింపు చర్యల పురోగతిని సమీక్షించి, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.




