Srikakulam: శ్రీకాకుళంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీటీసీ నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. 30 స్థానాలకు 245 నామినేషన్లు దాఖలైనట్లు జెడ్పీ సీఈవో వెంకటరామన్ వెల్లడించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 23 Oct 2026 10:41 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం!

శ్రీకాకుళం: జిల్లాలో జెడ్పీటీసీ నామినేషన్ల గడువు శుక్రవారమైన చివరి రోజు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్ వెల్లడించారు. చివరి రోజు నామినేషన్ల పర్వం జోరుగా సాగడంతో, మొత్తం 30 స్థానాలకు గాను క్యుములేటివ్ నామినేషన్ల సంఖ్య 245కి చేరుకుందని ఆయన తెలిపారు.

గడువు ముగిసేసరికి ప్రధాన పార్టీల వారీగా నమోదైన వివరాల ప్రకారం.. తెలుగుదేశం పార్టీ తరఫున 86, వైఎస్సార్‌సీపీ తరఫున 77, జనసేన తరఫున 31, బీజేపీ తరఫున 23, కాంగ్రెస్ తరఫున 15, సీపీఎం తరఫున 4, సీపీఐ తరఫున 1 చొప్పున నామినేషన్లు అందగా, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది నామినేషన్లు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.