Tekkali: రావివలస ఎండల మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ!
Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి స్వయంభూ క్షేత్రంలో కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.
Tekkali: రావివలస ఎండల మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ!
టెక్కలి: టెక్కలి మండలం రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి స్వయంభూ క్షేత్రంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం రెండవ సోమవారం పర్వదినం సందర్భంగా వేకువజాము నుండి స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చే భక్తులు సౌకర్యం కోసం దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ప్రవేశం, శీర్షాభిషేకం దర్శనాల క్యూ లైన్ ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.




