Srikakulam: శ్రీకాకుళంలో కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి ప్రచారం!

Srikakulam: శ్రీకాకుళం నగరంలోని 53, 54, 55 వార్డుల్లో కూటమి మేయర్ అభ్యర్థిని దానేటి రాధారాణి, జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్, గొండు స్వాతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 18 Nov 2026 10:27 AM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళంలో కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి ప్రచారం!

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని 53, 54, 55 వార్డుల పరిధిలో కూటమి మేయర్ అభ్యర్థిని దానేటి రాధారాణి ప్రచారం జనవాహిని నడుమ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. స్థానిక కార్పొరేట్ అభ్య‌ర్థులు రెడ్డి శివ‌న్నారాయ‌ణ‌, రెడ్డి గిరిజాశంక‌ర్‌, రెడ్డి సూర్య‌నారాయ‌ణ‌తో పాటు స్థానిక టీడీపీ, జ‌న‌సేన‌, బీజెపీ నాయ‌కుల‌తో క‌ల‌సి ఆయా వార్డుల్లో ప‌ర్య‌టించారు.

ఆయా వార్డు ప్రజలు తమ సమస్యలను దానేటి దంపతులకు వివరిస్తూనే మేయర్ గా రాధారాణి గెలుపు ఖాయం అంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్, రాధారాణి, ఎమ్మెల్యే గొండు శంక‌ర్ స‌తీమ‌ణి గొండు స్వాతి మాట్లాడుతూ శ్రీకాకుళం నగర అభివృద్ధిని కాంక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం కార్పొరేషన్ కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు.

ఆయ‌న‌కు అండ‌గా నిలుస్తూ మ‌న‌మంద‌ర‌మూ గొండు శంక‌ర్‌కు అండ‌గా నిలుస్తూ కూట‌మి అభ్య‌ర్థి గెలుపును ఆయ‌నకు కానుక‌గా అందించాల‌ని కోరారు. విమాన‌యానశాఖ కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంక‌ర్ ల స‌హ‌కారంతో శ్రీ‌కాకుళం నగ‌రాన్ని స్వ‌ర్ణ‌, స్వ‌చ్ఛ శ్రీ‌కాకుళం నిర్మాణంలో భాగ‌స్వామ్యం అవుదామ‌ని చెప్పారు.

శ్రీకాకుళం న‌గ‌రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేద‌ల‌కు సేవ చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపారు. శ్రీ‌-7 పేరుతో శ్రీ‌కాకుళం అభివృద్ధికి ఓ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక ర‌చించామ‌న్నారు. చిన్న‌నాటి నుంచి త‌న తండ్రి వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను పుణికి పుచ్చుకున్నాన‌ని తెలిపారు. మీ ఇంటి ఆడ‌ప‌డుచుగా న‌న్ను దీవించి... గెలిపించండి... మీరిచ్చిన గెలుపును గుండెల్లో దాచుకుని ప్ర‌తీ ఒక్క‌రి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతాన‌న్నారు.

స్వార్థ రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పి... సేవాగుణం క‌లిగిన రాజ‌కీయాల‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరారు. జ‌న‌సేన నాయ‌కులు డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ ఇప్ప‌టికే న‌గ‌ర ప‌రిధిలోని 60 వార్డుల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించామ‌ని ఆ స‌మ‌స్యలకు ప‌రిష్కార‌మే ధ్యేయంగా ప్ర‌ణాళిక రచించామ‌ని వివరించారు.

విజ్ఞులైన సిక్కోలు ప్ర‌జ‌లు గాజుగ్లాస్ గుర్తుపై ఓటు వేసి కూట‌మి మేయ‌ర్ అభ్య‌ర్థి దానేటి రాధారాణిని 25 వేల ఓట్ల మెజార్టీ గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫారెస్టు డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ రాష్ట్ర డైర‌క్ట‌ర్ గేదెల చైత‌న్య‌, జ‌న‌సేన నాయ‌కులు గురుప్ర‌సాద్ గౌడ్‌, మ‌నోజ్‌, కాక‌ర్ల ప్ర‌దీప్‌, కుమార్‌, వీర మ‌హిళ‌లు బొడ్డి మోహ‌న‌ల‌క్ష్మీ, స‌త్య‌వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.