Srikakulam: మొగదాలపాడు గ్రామ ప్రజల వందేళ్ల కల సాకారం

Srikakulam: మొగదాలపాడు గ్రామ ప్రజల వందేళ్ల కల సాకారమైంది. గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు శంకుస్థాపనలు చేశారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 9 Oct 2026 4:53 PM IST
Srikakulam
X

Srikakulam: మొగదాలపాడు గ్రామ ప్రజల వందేళ్ల కల సాకారం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా గార మండలం మొగదాలపాడు గ్రామ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దాదాపు వందేళ్లుగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. మొగదాలపాడును రెవెన్యూ గ్రామంగా గుర్తించడం ద్వారా ప్రజలకు భూహక్కులు కల్పించడంతో పాటు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యేందుకు మార్గం సుగమమైందన్నారు. రెవెన్యూ మ్యాప్‌లో గ్రామానికి గుర్తింపు ఉంటేనే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతాయని వివరించారు.

రాష్ట్రంలో గొప్ప నాయకులమని చెప్పుకునే గత పాలకులు చిన్న రెవెన్యూ సమస్యను కూడా పరిష్కరించలేకపోయారని విమర్శించారు. చిన్న సమస్యను పరిష్కరించలేని నాయకులు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

మొగదాలపాడు గ్రామానికి రెవెన్యూ గ్రామంగా గుర్తింపు కల్పించి, తమ చిరకాల సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.