Srikakulam: కాశీబుగ్గలో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష

Srikakulam: కాశీబుగ్గలో దశాబ్దాల కల అయిన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష. ఇది చేతల ప్రభుత్వమని వెల్లడి.

B LOKANADHAM, PALASA
Published on: 28 Sept 2026 5:29 PM IST
Srikakulam
X

Srikakulam: కాశీబుగ్గలో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతు బజార్ కల ఎట్టకేలకు సాకారమవుతోంది. కాశీబుగ్గ మూడు రోజుల జంక్షన్ ఎదురుగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో రైతు బజార్ నిర్మాణ పనులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఇది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని అన్నారు. రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా రైతు బజార్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA