Srikakulam: శ్రీకాకుళంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభం
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 5 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంత్రి సత్యకుమార్ వర్చువల్‌గా ప్రారంభించారు.
Srikakulam: శ్రీకాకుళంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభం
Srikakulam: గ్రామీణ ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' (విలేజ్ హెల్త్ క్లినిక్స్) వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం అట్టహాసంగా జరిగింది.
ఈ విశేష సభలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను శ్రీకాకుళం లో ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు.
"ఆరోగ్యం పరమం ధనం" అనే సమున్నత నినాదంతో, ప్రజల ముంగిటకే నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను చేరువ చేసే క్రమంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈ. ఎన్. వి. నరేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




