Srikakulam: ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఎమ్మెల్యే గొండు శంకర్ వేడుకోలు!
Srikakulam: మహిళలంటే తనకు గౌరవం లేదన్నట్లు ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
Srikakulam: ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఎమ్మెల్యే గొండు శంకర్ వేడుకోలు!
శ్రీకాకుళం: మహిళలు అంటే తనకు గౌరవం లేదన్నట్టు గొడ్డలి పార్టీ నాయకుల ప్రచారం నమ్మవద్దు అంటూ శ్రీకాకుళం ఎం.ఎల్.ఎ. గొండు శంకర్ చేతులు జోడించి వేడుకున్నారు.. దివంగత నేత అప్పలసూర్యానారాయణ అన్నా.. గుండ లక్ష్మీదేవి అన్నా తనకు అపార గౌరవం ఉందన్నారు. కొంతమంది కావాలని వక్రీకరించి తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో నమ్మి 53 వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే కారణం మహిళలే అన్నారు. తాను ప్రజల కోసమే అనుక్షణం పనిచేస్తాననీ, ప్రజలకు కార్పొరేషన్ లో సమస్యలు ఉంటే తన చుట్టూ తిరగకుండా ఉండేందుకు, కార్పొరేటర్లే ప్రజల వద్దకు వచ్చేలా స్ఠానిక ఎన్నికలు జరిగాలా తాను ప్రయత్నం చేశానన్నారు.. కొందరు పనికట్టుకొని కావాలనే తన పైన బ్యాడ్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గోండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.




