Narsampeta: నరసన్నపేట నియోజకవర్గంలో నూతన రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం

Narsampeta: జలుమూరు మండలం ఎస్.టి. మాకివలస, జమినివలస గ్రామాల్లో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కొత్త రోడ్డు పనులను ప్రారంభించారు.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 30 Sept 2026 2:04 PM IST
Narsampeta
X

Narsampeta: నరసన్నపేట నియోజకవర్గంలో నూతన రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం

Narsampeta: నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు రహదారులను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు స్పష్టం చేశారు. బుధవారం జలుమూరు మండలం ఎస్.టి. మాకివలస,జమినివలస గ్రామంలో అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించిన "పల్లె పండుగ 3.0" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... పల్లెల ఆర్థిక, సామాజిక పురోగతికి సురక్షితమైన, నాణ్యమైన రోడ్డు రవాణా వ్యవస్థే అత్యంత కీలకమైన పునాది అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఎస్.టి. మాకివలస, జమినివలస గ్రామంలో నూతన రహదారి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్థితిగతులు, మౌలిక వసతులపై ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యలు, మౌలిక వసతుల కొరత, విద్యుత్ లీకేజీలు లేదా విరిగిన విద్యుత్ స్తంభాల మరమ్మతులు, నూతన స్తంభాలు వంటి ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రజలకు అంతరాయం లేని విద్యుత్‌ను అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉండాలని విద్యుత్ శాఖ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి గారు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు గారు, బగ్గు నాయన్న గారు, తహశీల్దార్ గారు, ఎంపీడీవో గారు, పంచాయతీరాజ్ అధికారులు మరియు మండల అన్ని శాఖల అధికారులు , ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA