Srikakulam: శ్రీకాకుళం వైసీపీ మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి నామినేషన్!
Srikakulam: శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సోమవారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Srikakulam: శ్రీకాకుళం వైసీపీ మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి నామినేషన్!
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సోమవారం నామినే షన్ దాఖలు చేశారు. కలె క్టర్ కార్యాలయంలో జేసీ ఫర్మాన్అహ్మద్ ఖాన్కు తన నామినేషన్ పత్రాలను లక్ష్మీదేవి సమర్పించారు. కార్యక్రమంలో కుమారుడు డాక్టర్ గుండ విశ్వ నాథ్ పాల్గొన్నారు.
అంతకుముందు అరసవల్లి ప్రజలతో కలిసి లక్ష్మీదేవి స్థానికంగా ర్యాలీ నిర్వహించారు. అలాగే అరసవిల్లి గ్రామ దేవత అయిన అసిరితల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబం అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు ఏ విధంగా పనిచేస్తామో మీకు తెలుసు.
వార్డుల్లో పర్యటిస్తుంటే వారి అభిమానాన్ని చూసి ఆనంద భాష్పాలు వచ్చాయని అన్నారు. ఈరోజు 11:30 కి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఫ్యాన్ గుర్తుకు వేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు. అలాగే నేరుగా బాధ్యతలు తీసుకోగానే తప్పనిసరిగా నగరాన్ని సుందర శ్రీకాకుళం నగరంగా తీర్చిదించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.




