Srikakulam: శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి భారీ నామినేషన్ ర్యాలీ!

Srikakulam: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి వందలాది మంది జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 16 Nov 2026 12:28 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి భారీ నామినేషన్ ర్యాలీ!

శ్రీకాకుళం: మా మొద‌ట ప్రాధాన్య‌త డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి, విద్య‌, వైద్యంపై దృష్టి కేంద్రీక‌రించ‌నున్న‌ట్లు కూట‌మి మేయ‌ర్ అభ‌ర్ధి దానేటి రాధారాణి అన్నారు. త‌న నామినేష‌న్ వేయ‌డానికి త‌న ఇంటి నుండి భారీ ర్యాలీ నిర్వ‌హించారు. వంద‌లాది మంది జ‌న‌సేన‌, టిడిపి, బిజెపి కార్య‌క‌ర్త‌ల‌తో ర్యాలీగా న‌గ‌రంలో ఉన్న విజ‌య‌గ‌ణ‌ప‌తి ఆల‌యం వ‌ద్ద కు చేరుకున్నారు.

అక్క‌డ నామినేష‌న్ ప‌త్రాల‌ను ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పిద‌ప ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌చ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ కూట‌మి అభ్య‌ర్ధిగా మీరంతా ఆశీర్వ‌దించాల‌న్నారు. మ‌న న‌గ‌రంలోని మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కే మొద‌టి ప్రాధాన్య‌త నిస్తున్నాన‌ని రాజ‌కీయాల్లో అనుభ‌వం లేక‌పోయినా తాను న‌గ‌రంలో నివాసిని ఇక్క‌డ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తున్నాన‌ని అన్నారు.

డా. దానేటి శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ స్వ‌చ్ఛ శ్రీ‌కాకుళం సాధ‌నే మొద‌టి థేయ్యంగా ప‌నిచేయ‌డం జ‌రుగుతుంది అన్నారు. 24 గంట‌లు డాక్ట‌ర్ గా నేను ఎలా అందుబాటులో ఉంటున్నాను కూట‌మి అభ్య‌ర్ధిగా రాధారాణి కూడా అందుబాటులో ఉండే వ్య‌క్తి అని అన్నారు. క‌నుక గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలుపుకు బాట‌లు వేయాల్సిందిగా విజ్ఙ‌ప్తి చేశారు.

చాలా మంది కూట‌మిలో లుక‌లుక‌లు ఉన్నాయ‌ని అనుకుంటున్నారు అది త‌ప్పు. చంద్ర‌బాబునాయుడు, మోది, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ముగ్గురు మ‌న రాష్ట్రం ఎలా అభివృద్ది బాట ప‌ట్టిస్తున్నారో అదే త‌ర‌హాలో శ్రీ‌కాకుళం న‌గ‌రం ఓ సుంద‌ర న‌గ‌రంగా తీర్చి దిద్ద‌డం, స్వ‌చ్ఛ శ్రీ‌కాకుళం గా మార్చేలా ప‌నిచేస్తామ‌ని మీ అంద‌రి ముందు హామీ ఇస్తున్నాన‌ని అన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.