Srikakulam: కవిటి జెడ్పీటీసీగా కూటమి అభ్యర్థి లోళ్ల రాజేష్ నామినేషన్!

Srikakulam: ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి జెడ్పీటీసీ స్థానానికి కూటమి జనసేన అభ్యర్థిగా లోళ్ల రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాయి.

G.RAMBABU, SOMPET
Published on: 23 Oct 2026 5:47 PM IST
Srikakulam
X

Srikakulam: కవిటి జెడ్పీటీసీగా కూటమి అభ్యర్థి లోళ్ల రాజేష్ నామినేషన్!

శ్రీకాకుళం: కవిటి ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండల జెడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా లోళ్ల రాజేష్‌ శుక్రవారం శ్రీకాకుళంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ దాఖలు చేయడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

లోళ్ల రాజేష్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కవిటి మండల నాయకులు బైపల్లి దాలయ్య, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైపల్లి ఈశ్వరరావు, పెద్దింటి రవీంద్ర వర్ధన్‌, గుజ్జల శంకర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET