Kanchili: పెద్దకొజ్జిరిలో కూటమి అభ్యర్థుల జోరు: వెల్లువెత్తిన ప్రజా మద్దతు!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరి గ్రామంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులు చేపట్టిన ఇంటింటి ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
Kanchili: పెద్దకొజ్జిరిలో కూటమి అభ్యర్థుల జోరు: వెల్లువెత్తిన ప్రజా మద్దతు!
కంచిలి: కంచిలి మండలంలోని జాడిపూడి ప్రాదేశిక పరిధిలోని పెద్దకొజ్జిరి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్, ఎంపీపీ అభ్యర్థి మాదిన విమల రామారావు, జెడ్పీటీసీ అభ్యర్థి మద్దిల ఆనందరావులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. గ్రామంలో పర్యటిస్తూ ఓటర్లను కలిసిన అభ్యర్థులకు స్థానికులు స్వాగతం పలికి తమ మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి మాదిన విమల రామారావు మాట్లాడుతూ, ప్రజలు చూపిస్తున్న ఆదరణ, మద్దతు తమకు మరింత బాధ్యతను పెంచుతున్నాయని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులుగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచులు బొడ్డ రామ్ కుమార్, పిలక చిన్నబాబు, బొడ్డ హరిబాబు, బొడ్డ కవిబాబు బొడ్డ జగ్గారావు, సీతారామమూర్తి, తో పాటు కోటమీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలుసుకుని అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.




