Kanchili: కొల్లూరు సర్పంచ్ బరిలో 22 ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ రవీనా రెడ్డి!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 22 ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ పైల రవీనా రెడ్డి మంగళవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.
Kanchili: కొల్లూరు సర్పంచ్ బరిలో 22 ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ రవీనా రెడ్డి!
కంచిలి: కంచిలి మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందడి మొదలైంది. సర్పంచ్ అభ్యర్థిగా కర్తలి గ్రామానికి చెందిన పైల రవీనా రెడ్డి (22 ఏళ్లు) మంగళవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోనే 2వ పిన్న వయస్కురాలు..!
బీటెక్, ఐఐఐటీ నూజివీడులో చదివిన రవీనా రెడ్డి రాష్ట్రంలోనే 2వ పిన్న వయస్కురాలిగా నామినేషన్ వేసి రికార్డు సృష్టించారు. చదువుకున్న యువ నాయకురాలు, అభివృద్ధి చేస్తుందనే నమ్మకంతో గ్రామ ప్రజలు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తండ్రి వారసత్వంతో.. సేవా బాటలో రవీనా
రవీనా తండ్రి పైల సూర్యనారాయణ రెడ్డి గతంలో ఇదే కొల్లూరు పంచాయతీలో సర్పంచ్‌గా పనిచేశారు. 2013-18 కాలంలో ఉత్తమ సర్పంచ్ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.
తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ, ఆధునిక ఆలోచనలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రవీనా హామీ ఇచ్చారు.
అభివృద్ధే లక్ష్యం..!
నామినేషన్ అనంతరం రవీనా మాట్లాడుతూ.. కొల్లూరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, విద్య, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని చెప్పారు.
గ్రామ పెద్దలు, మహిళలు, యువత రవీనా రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొల్లూరులో రవీనా గెలుపు ఖాయమని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.




