Srikakulam: దానేటి దాతృత్వం.. ప్రమాద బాధితుడి వైద్యానికి రూ.5 లక్షల సాయం!
Srikakulam: శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న నిరుపేద బాధితుడు శిల్లా ప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ రూ.5 లక్షల సాయం అందించారు.
Srikakulam: దానేటి దాతృత్వం.. ప్రమాద బాధితుడి వైద్యానికి రూ.5 లక్షల సాయం!
శ్రీకాకుళం: జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పెదపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళింగ కోమటి సామాజిక వర్గానికి చెందిన శిల్లా ప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ప్రమాదంలో గాయపడిన శిల్లా ప్రసాద్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన వైద్య ఖర్చులను భరించడం కుటుంబ సభ్యులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు చెల్లించాలని కోరినట్లు తెలిసింది.
ఈ విషయం డాక్టర్ దానేటి శ్రీధర్ దృష్టికి జేఎంఆర్ సంతు, కరుణ్ కుమార్ గుప్తా, అరుణ్ కుమార్ గుప్తా రావడంతో వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిల్లా ప్రసాద్‌ను డాక్టర్ దానేటి శ్రీధర్ పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బుధవారం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఎంఆర్ సంతు, కరుణ్ కుమార్ గుప్తా, అరుణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.




