Srikakulam: స్వర్ణ శ్రీకాకుళం నిర్మాణమే లక్ష్యం: డాక్టర్ దానేటి శ్రీధర్!

Srikakulam: కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణిని గాజుగ్లాసు గుర్తుపై గెలిపించి స్వర్ణ, స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో భాగస్వాములు కావాలని జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 17 Nov 2026 11:56 AM IST
Srikakulam
X

Srikakulam: స్వర్ణ శ్రీకాకుళం నిర్మాణమే లక్ష్యం: డాక్టర్ దానేటి శ్రీధర్!

శ్రీ‌కాకుళం: కూట‌మి మేయ‌ర్ అభ్య‌ర్థినిగా పోటీ చేస్తున్న దానేటి రాధారాణిని ఆద‌రించి గ్లాసుగుర్తుపై ఓటు వేసి గెలిపించి స్వ‌ర్ణ‌, స్వ‌చ్ఛ శ్రీ‌కాకుళం నిర్మాణంలో భాగ‌స్వామ్యుం కావాల‌ని క్రీడాకారుల‌కు, వాక‌ర్స్‌కు జ‌న‌సేన నాయ‌కులు డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ పిలుపునిచ్చారు. న‌గ‌రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో మంగ‌ళ‌వారం ఉద‌యం గుడ్‌మార్నింగ్ దానేటి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ శ్రీ‌కాకుళం న‌గ‌ర వాసుల‌కు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ట్రాక్‌లు నిర్మించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, ప్రతి చోట కూటమి అభ్యర్థులకు ప్రత్యేక ఆదరణ లభిస్తుందని చెప్పారు.

దానేటి రాధారాణి మేయర్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని అన్నారు. శ్రీ-7 పేరుతో శ్రీకాకుళం నగరాన్ని ఏడు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించినట్టు వివరించారు. శ్రీకాకుళం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన రోడ్లు డ్రైనేజీలు తో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

జ‌న‌సేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యసాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ జ‌న‌సేన పార్టీని ఆద‌రించి గాజుగ్లాస్‌పై ఓటు వేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. ప‌ద‌వుల కోసం ఆశించ‌కుండా... శ్రీ‌కాకుళంలో యువ‌త భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని విజ్ఞులైన శ్రీ‌కాకుళం న‌గ‌ర వాసులు గాజుగ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.