Srikakulam: 'అర్నబ్' తుఫాను ముప్పు రేపు విద్యాసంస్థలకు సెలవు!

Srikakulam: 'అర్నబ్' తుఫాను తీవ్రత దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు రేపు (మంగళవారం) సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 26 Oct 2026 6:18 PM IST
Srikakulam
X

Srikakulam: 'అర్నబ్' తుఫాను ముప్పు రేపు విద్యాసంస్థలకు సెలవు!

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, తుఫాను ప్రభావం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఈ సెలవు వల్ల విద్యార్థుల విద్యాక్యాలెండర్‌కు ఆటంకం కలగకుండా, నష్టపోయే పనిదినాన్ని భర్తీ చేయడానికి తగిన ప్రత్యామ్నాయ పనిదినాన్ని కేటాయిస్తూ త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు. అధికారులు, పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండి విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.