Srikakulam: ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి: ధర్మాన కృష్ణదాస్!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు: ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపు. వినాయక నిమజ్జనాల్లో భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచన.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 22 Sept 2026 8:55 PM IST
Srikakulam
X

Srikakulam: ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి: ధర్మాన కృష్ణదాస్!

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని కోరారు.

రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొనే భక్తులు, కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా చూడటంతో పాటు, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు అభయం ఇవ్వాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.