Narasannapeta: నరసన్నపేటలో పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు

Narasannapeta: నరసన్నపేటలో పర్యావరణహితంగా మట్టి విగ్రహాలతో వినాయక చవితి వేడుకలు. శ్రీదేవి, సాయి నగర్ కాలనీల్లో వందలాది మహిళలతో దీపారాధన, భక్తిశ్రద్ధలతో పూజలు.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 17 Sept 2026 7:20 AM IST
Narasannapeta
X

Narasannapeta: నరసన్నపేటలో పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో పలుకాలనీలలో వినాయక చవితిఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నా యి. ఈసారి రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం బాగా తగ్గింది. వివిధ రూపాలలో గణేష్ విగ్రహాలను ఎక్కువగా మట్టితోనే తయారు చేయించి ప్రతిష్టించారు.

చాలా వరకు పర్యావరణహితంగానే వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం కోలాటాలు, భజనలతో భక్తిశ్రద్ధలతో కాలనీవాసులంతా ఏకమై గణనాధుని పూజించుకుంటున్నారు ఈరోజు స్థానిక శ్రీదేవి నగర్ సాయి నగర్ కాలనీలో శ్రీ శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధానం వద్ద కాలనీలోనే మహిళలు అందరిచే దీపారాధన చేసి హారతులతో వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజించారు ఈ కార్యక్రమంలో వందలాది మహిళా భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా గణనాధుని పర్యావరణహితంగా భక్తిశ్రద్ధలతో మట్టి తో గణనాథుని ప్రతిష్టించి నవరాత్రి వేడుకలు జరుపుకుంటామని కాలనీవాసులంతా సకుటుంబ సపరివార సమేతంగా కలిసివలసి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని తెలిపారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA