Srikakulam: తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన ఇచ్ఛాపురం యంత్రాంగం!

Srikakulam: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలు: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం. 4 మండలాల అధికారులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అత్యవసర సమీక్ష.

G.RAMBABU, SOMPET
Published on: 21 Sept 2026 10:29 PM IST
Srikakulam
X

Srikakulam: తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన ఇచ్ఛాపురం యంత్రాంగం!

శ్రీకాకుళం: తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్.. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట నాలుగు మండలాలు స్పెషల్ ఆఫీసర్లు, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కమిషనర్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, నాలుగు మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 25 వరకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 21వ తేదీ రాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

తుపాను హెచ్చరికల దృష్ట్యా నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, ఉద్యోగులందరూ రేపటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. బహుదా, మహేంద్రతనయ నదులకు వరద వచ్చే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఉన్నతాధికారులు, నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అంగన్వాడీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET