Pathapatnam: పాతపట్నం విద్యుత్ బిల్లుల కేంద్రం వద్ద వినియోగదారుల అవస్థలు!

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం విద్యుత్ బిల్లుల కేంద్రం వద్ద సిబ్బంది నిర్లక్ష్యంతో వినియోగదారుల అవస్థలు. గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ప్రజలు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 9 Nov 2026 10:36 AM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నం విద్యుత్ బిల్లుల కేంద్రం వద్ద వినియోగదారుల అవస్థలు!

Pathapatnam: పాతపట్నం మండల కేంద్రంలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రం వద్ద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నెలవారీ కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించేందుకు ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వృద్ధులు మహిళలు మరియు సామాన్య ప్రజలు కేంద్రం వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

కౌంటర్ తెరిచి బిల్లులు స్వీకరించే సిబ్బంది సమయానికి రాకపోవడంతో నిరీక్షిస్తూ వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు, సాంకేతిక సమస్యలు లేదా సిబ్బంది గైర్హాజరు సమాచారం ముందస్తుగా తెలియజేయకుండా ఇలా గంటల తరబడి నిలబెట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సిబ్బంది సకాలంలో హాజరయ్యేలా చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM