Amadalavalasa: ఆముదాలవలస 1వ వార్డులో కూన ప్రమీల విస్తృత ఎన్నికల ప్రచారం!

Amadalavalasa: ఆముదాలవలస పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 1వ వార్డులో కూటమి బలపరిచిన టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 20 Nov 2026 12:11 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: ఆముదాలవలస 1వ వార్డులో కూన ప్రమీల విస్తృత ఎన్నికల ప్రచారం!

ఆముదాలవలస: శ్రీకాకుళం ఆముదాలవలస పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 1వ వార్డులలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి కూన ప్రమీల విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను, స్థానికులను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరుతూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం కొనసాగించారు.

ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ సతీమణి శ్రీమతి కూన ప్రమీల తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.