Srikakulam: కవిటి: వైఎస్సార్‌సీపీకి షాక్, టీడీపీలో చేరిన 70 కుటుంబాలు!

Srikakulam: శ్రీకాకుళం: కవిటి మండలం బైరిపురం మాజీ సర్పంచ్ పుల్లట రమాదేవి ప్రభాకర్‌రావుతో పాటు 70 కుటుంబాలు ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో టీడీపీలో చేరాయి.

G.RAMBABU, SOMPET
Published on: 17 Oct 2026 1:13 PM IST
Srikakulam
X

Srikakulam: కవిటి: వైఎస్సార్‌సీపీకి షాక్, టీడీపీలో చేరిన 70 కుటుంబాలు!

Srikakulam: కవిటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం బైరిపురం గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ పుల్లట రమాదేవి ప్రభాకర్ రావుతో పాటు సుమారు 70 కుటుంబాలు శనివారం వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు తన క్యాంపు కార్యాలయంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, కవిటి మండల టీడీపీ అధ్యక్షుడు పొందల కృష్ణారావు, కార్యదర్శి బెందాళం తిరుమల, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాశ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బెందాళం రమేష్, పీఏసీఎస్ ప్రతినిధి ఎర్ర బాసు, జెడ్ఆర్‌యూసీ సభ్యుడు రంగా, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లట రాజు, కడియాల వెంకటరావు, నర్తు దేవేంద్ర, కడియాల చంటి, ప్రియా రాజేష్, ప్రియా నాగు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET