Srikakulam: శ్రీకాకుళం 29వ వార్డు వైసీపీ అభ్యర్థి ఉషశ్రీకి విశేష ఆదరణ!
Srikakulam: శ్రీకాకుళం నగరపాలక సంస్థ 29వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉంగరాడ ఉషశ్రీకి స్థానిక ఓటర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పారిశుధ్య, తాగునీటి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
Srikakulam: శ్రీకాకుళం 29వ వార్డు వైసీపీ అభ్యర్థి ఉషశ్రీకి విశేష ఆదరణ!
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో 29వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఉంగరాడ ఉషశ్రీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. విద్యావంతురాలు రాజకీయాల కొత్తగా వచ్చినా తను నివాసం ఉన్న వార్డులో సమస్యల పట్ల అవగాహన ఉన్న ఈమె స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని ఓటర్లకు హామీలు ఇస్తున్నారు.
స్థానికంగా ఉన్న సమస్యలలో ముఖ్యమైనది పారిశుధ్య లోపం, తాగునీటి సమస్య పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లో కొత్తయినా పాలించడంలో మహిళలే ముందుంటారని మీడియాకు తెలిపారు. స్థానికంగా చెరువులను కాలువలను ఆక్రమణకు గురైన వాటిని వాటిని తొలగించి ప్రభుత్వం కు అప్పగిస్తానని అన్నారు.
నేను వచ్చేటప్పుడు చూపించే అభిమానం ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా తమ పార్టీ గుర్తుకి ఓటు వేయాలని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుమేరకు తాను గృహిణిగా ఉన్న అన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచాలో తెలిసిన మాకు మన వార్డు ఏ విధంగా ఉండాలో అదే తరహాలో ఉండేలా మీకు అండగా ఉండి పని చేస్తానని అన్నారు. ప్రలోభాలకి లోన్ కాకుండా తనకు ఓటు వేయాలని కోరారు.




