Srikakulam: శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ చిత్రపటానికి నివాళులర్పించిన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు!
Srikakulam: జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం దేవ శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విశ్వకర్మను సకల కళలకు ఆదిదేవుడిగా, వాస్తుశిల్పిగా, శిల్పకళకు ఆదిగురువుగా పరిగణిస్తారని తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో అనేక పట్టణాలు, నిర్మాణాలను విశ్వకర్మ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆయుధాలు, పనిముట్ల ప్రాధాన్యతను తెలియజేసిన మహోన్నత వ్యక్తిగా విశ్వకర్మను భావిస్తారని అన్నారు.
శాస్త్రం, చిత్రలేఖనం, శిల్పకళ, వాస్తుశాస్త్ర రంగాలకు విశ్వకర్మ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విశ్వకర్మ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. శేషాద్రి, పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి సి.హెచ్. గోపినాథ్, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




