Kurupam: షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం అగ్నికి ఆహుతి.. లక్షల రూపాయల ఆస్తి నష్టం

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయిన దుకాణం. లక్షల్లో ఆస్తి నష్టం.

V.SESHU	, KURUPAM
Published on: 21 Jun 2026 12:23 PM IST
Kurupam
X

Kurupam: షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం అగ్నికి ఆహుతి.. లక్షల రూపాయల ఆస్తి నష్టం

కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో రావాడ రోడ్ లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులకు చెందిన కందుల విశ్వేశ్వరరావు దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే దుకాణమంతా వ్యాపించాయి.

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దుకాణంలో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోగా, లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక యువత, గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఫైర్ ఇంజన్ చేరుకునేలోపే స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలు సమీపంలోని ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కురుపాం ఎస్సై నారాయణరావు చొరవ చూపి సమీప ప్రాంతాల నుంచి నీటి బస్తాలు సేకరించి యువత సహకారంతో మంటలపై నీటిని చల్లి అదుపు చేసే ప్రయత్నం చేశారు.

తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పూర్తిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.

అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన బాధితుడు కందుల విశ్వేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story