Srikakulam: శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా!
Srikakulam: ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Srikakulam: శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా!
Srikakulam: కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు రక్షించబడేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కు సంబంధించి ఎన్నికల కమిషన్ పనితీరుపై వివిధ అభిప్రాయాలు, అభ్యంతరాలు బహిరంగంగా చర్చకు వచ్చిన నేపథ్యంలో ప్రజలలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ ఉందని, అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని పేర్కొన్నారు.




