Narsannapeta: నరసన్నపేటలో ఘనంగా 'సేవా సంకల్ప్ అభియాన్' ఉచిత వైద్య శిబిరం!
Narsannapet: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం, రక్తదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.
Narsannapeta: నరసన్నపేటలో ఘనంగా 'సేవా సంకల్ప్ అభియాన్' ఉచిత వైద్య శిబిరం!
Narsannapeta: ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా కృషి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదానం శిబిరాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్ గారు, మిరియాపల్లి వెంకటప్పలనాయుడు గారు, పోలాకి పిఎసిఎస్ ఛైర్మన్ భైరి భాస్కరరావు గారు, నరసన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటరి కమిటీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ జామి వెంకట్రావు గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు గారు,క్లస్టర్ ఇంచార్జ్ రావాడ కృష్ణారావు గారు, యూనిట్ ఇన్చార్జ్లు పీస కృష్ణ గారు, శిమ్మ జగన్నాథం గారు, కోరాడ రామచంద్రరావు గారు,జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బలగ భారతి గారు,AMC ఛైర్మన్ ప్రతినిధి పాగోటి అప్పలనాయుడు మాష్టారు గారు,
మాజీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు గారు, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బోయిన సతీష్ గారు, పిఎసిఎస్ డైరెక్టర్ సరిపల్లి మధు గారు,నేతింటి విశ్వేశ్వరరావు గారు, కింజరాపు చిన్నవాడు గారు, వారణాసి రమేష్ గారు,కొంక్యాన బాబ్జి గారు, దుప్పలపూడి లక్ష్మణరావు గారు, పుచ్చల కల్పన గారు,జిల్లా తెలుగు నాడు ఫెడరేషన్ అధ్యక్షులు బలగ ప్రహర్ష గారు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రావాడ గణపతిరావు గారుడిసిహెచ్ఎస్ (DCHS) జయలక్ష్మితో పాటు స్థానిక ప్రభుత్వ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




