Kaviti: కవిటిలో అగ్నిప్రమాద బాధితుడికి చింతామణి సీ ఫుడ్స్ సంఘం ఆర్థిక సాయం!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అగ్నిప్రమాదంలో రూ. 25 లక్షల సామాగ్రి కోల్పోయిన మత్స్యకారుడు తోటయ్య కుటుంబానికి చింతామణి సీ ఫుడ్స్ సంఘం రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించింది.
Kaviti: కవిటిలో అగ్నిప్రమాద బాధితుడికి చింతామణి సీ ఫుడ్స్ సంఘం ఆర్థిక సాయం!
Kaviti: కవిటి మండలం పెద్ద కపాసుకుద్ధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారుడు గీత తోటయ్యకు చెందిన సుమారు రూ. 25 లక్షల విలువైన వ్యాపార సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ఆ కుటుంబాన్ని చింతామణి సీ ఫుడ్స్ అసోసియేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో ఆదుకున్నారు. శనివారం బాధిత కుటుంబానికి వ్యాపార పునఃప్రారంభానికి అవసరమైన రూ.లక్ష విలువైన 30 సింటెక్స్ బాక్సులు, రూ.1.50 లక్షల నగదు.. మొత్తం రూ.2.50 లక్షల సాయాన్ని సంఘ సభ్యులు అందించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పాండవ తారకేశ్వరరావు మాట్లాడుతూ.. "శ్రీ చింతామణి సీ ఫుడ్స్ సంఘం ఎల్లప్పుడూ తమ సభ్యులకు అండగా ఉంటుంది. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేయడమే మా లక్ష్యం" అని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ముత్తు కాశీ, గౌరవ అధ్యక్షుడు బైపిల్లి మోహనరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.




