Kaviti: సముద్ర తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
Kaviti: కవిటి మండలం ఇద్దువానిపాలెంలో సముద్ర తాబేళ్ల సంరక్షణపై అవగాహన సదస్సు. మత్స్యకారులు, మహిళలు, యువతకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ సూచనలు.
Kaviti: సముద్ర తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
కవిటి: కవిటి సముద్ర జీవవైవిధ్య పరిరక్షణలో కీలకమైన సముద్ర తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సూచించారు. కవిటి మండలం ఇద్దువానిపాలెం గ్రామంలో మంగళవారం మత్స్యకారులు, యువత, మహిళలకు సముద్ర తాబేళ్ల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సముద్ర తాబేళ్లు సంతానోత్పత్తి కోసం తీర ప్రాంతాలకు చేరుకునే సమయంలో, చేపల వేటకు ఉపయోగించే వలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయని నిర్వాహకులు వివరించారు. ఈ పరిస్థితిని నివారించేందుకు మత్స్యకారులకు సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యత, సముద్ర పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర, సముద్ర పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. చేపల వేట సమయంలో తాబేళ్లు వలల్లో చిక్కుకున్నప్పుడు వాటిని సురక్షితంగా విడిపించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సముద్ర తాబేళ్లను సంరక్షించడం ద్వారా సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని, ఈ విషయంలో మత్స్యకారులు, యువత, మహిళలు చైతన్యంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రవికుమార్, ట్రీ ఫౌండేషన్ జిల్లా సమన్వయకర్త కె. సోమేశ్వరరావు, ఇచ్చాపురం ఎఫ్‌డీఓ ముసలి నాయుడు, వీఎఫ్‌లు, ఎంఎఫ్‌సీ అధ్యక్షులు, మత్స్యకారులు పాల్గొన్నారు.




