Kaviti: ఆర్‌.బైరిపురంలో ఎస్సీ సామాజిక భవనం ప్రారంభం!

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఆర్‌. బైరిపురంలో రూ.11 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన ఎస్సీ సామాజిక భవనాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

G.RAMBABU, SOMPET
Published on: 19 Sept 2026 4:25 PM IST
Kaviti
X

Kaviti: ఆర్‌.బైరిపురంలో ఎస్సీ సామాజిక భవనం ప్రారంభం!

Kaviti: కవిటి మండలం ఆర్‌. బైరిపురం గ్రామంలో సుమారు రూ.11 లక్షల జిల్లా పరిషత్ నిధులతో నిర్మించిన ఎస్సీ సామాజిక భవనాన్ని శనివారం ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ ప్రతినిధి కడియాల పద్మా ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వర్గాల అవసరాలకు సామాజిక భవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి వచ్చిన భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పిరియా జగదీశ్వరమ్మ ఆనంద్, మాజీ సర్పంచ్ ప్రతినిధి పుల్లట ప్రభాకరరావు, కాంట్రాక్టర్ సనపల శ్రీనివాస్, రాజపురం ఎంపీటీసీ సనపల కృష్ణారావు, డి.జి. పుట్టుగ ఎంపీటీసీ చందాన పూర్ణచంద్రరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు యలమంచి నీలయ్య, మాజీ పీఏసీఎస్ సభ్యుడు ఎన్ని అశోక్, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET