Kanchili: అంపురంలో ఇంటి మేడపై డ్రాగన్ ఫ్రూట్ సాగు: ఆకట్టుకుంటున్న పంట
Kanchili: కంచిలి మండలం అంపురంలో లుండి కృష్ణవేణి అనే మహిళ ఇంటి మేడపై కుండీలలో సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నారు.
Kanchili: అంపురంలో ఇంటి మేడపై డ్రాగన్ ఫ్రూట్ సాగు: ఆకట్టుకుంటున్న పంట
కంచిలి: సాధారణంగా పొలాల్లోనే సాగు చేసే పంటలకు భిన్నంగా అంపురం గ్రామంలో లుండి కృష్ణవేణి ఇంటి మేడపై డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి పంట పండించారు. స్థానికంగా ఓ కుటుంబం మేడపై కుండీలలో పెంచుతున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు ప్రస్తుతం పూత, కాయలు రావడంతో ఆకట్టుకుంటోంది.
మేడపై పరిమిత స్థలంలోనే మొక్కలను పెంచుతూ సేంద్రియ పద్ధతుల్లో సంరక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు పూత వచ్చి కాయలు కాస్తుండటంతో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి మేడపై కూడా డ్రాగన్ ఫ్రూట్‌ను విజయవంతంగా పెంచవచ్చని ఈ సాగు ద్వారా తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.




