Rajam: రాజాంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!

Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో 4 మండలాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 8:10 AM IST
Rajam
X

Rajam: రాజాంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!

Rajam: ఉమ్మడిశ్రీకాకుళం జిల్లా రాజాం లో మండల పరిషత్ జిల్లా పరిషత్ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. రాజాం నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలోని ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తానికి రాజాం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభం కావడంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్