Chinamerangi: చినమేరంగి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ కానిస్టేబుల్‌కు ఘనంగా శ్రీమంతం!

Chinamerangi: పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ కానిస్టేబుల్ లక్ష్మికి సహచర సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా శ్రీమంతం వేడుక.

V.SESHU	, KURUPAM
Published on: 23 Sept 2026 10:24 AM IST
Chinamerangi
X

Chinamerangi: చినమేరంగి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ కానిస్టేబుల్‌కు ఘనంగా శ్రీమంతం!

Chinamerangi: పార్వతీపురం మన్యం జిల్లా, జియమ్మవలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కిల్లక లక్ష్మికు సహచర సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సెలవుపై వెళ్లనున్న సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలతో ఈ వేడుకను ఏర్పాటు చేయడం విశేషం.

కార్యక్రమానికి చినమేరంగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి రావు, ఎస్‌ఐ నీలకంఠం, చినమేరంగి పోలీస్ స్టేషన్ సిబ్బంది, సర్కిల్ కార్యాలయ సిబ్బంది హాజరై లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలతో ఒడిని నింపి, గాజులు తొడిగించి శ్రీమంతం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ పోలీస్ విధుల్లో కర్తవ్యనిష్ఠతో సేవలందిస్తున్న లక్ష్మి తల్లితనపు కొత్త ప్రయాణంలో అడుగుపెడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని, సుఖప్రసవంతో ఆరోగ్యంగా తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.

ఖాకీ యూనిఫామ్‌లో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, మాతృత్వ మాధుర్యాన్ని ఆహ్వానిస్తున్న లక్ష్మికి చినమేరంగి పోలీస్ కుటుంబం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక మహిళలు పాల్గొని తమ ఆశీస్సులు అందజేశారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM