Srikakulam: పాతపట్నంలో సర్పంచ్ అభ్యర్థి రాజారావు మాస్టారు ప్రచార జోరు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు, సతీమణి నల్లి సుజాత, టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Srikakulam: పాతపట్నంలో సర్పంచ్ అభ్యర్థి రాజారావు మాస్టారు ప్రచార జోరు!
శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గం మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం పాతపట్నం స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కుమ్మర వీధి, తెలకల వీధి, తుంబీశాపేట, కొత్త దేవాంగుల వీధి, ఉప్పర వీధి, జూబ్లీ హిల్స్ రోడ్, పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని నేనున్నానని భరోసా ఇస్తూ ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. అలాగా రాజారావు మాస్టారు ప్రతి ఒకరితో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు.
డ్రైనేజీ, మరియు త్రాగునీటి, సమస్యలు మాస్టర్ కి దృష్టికి తీసుకువెళ్లారు. నేనున్నానని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో భాగంగా పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు నల్లి రాజారావు మాస్టారు వారి సతీమణి నల్లి సుజాత మరియు ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




