Pathapatnam: మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా B-ఫారం పొందిన MLA MGR!

Pathapatnam: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడి నుండి స్థానిక ఎన్నికల B-ఫారాలు అందుకుని, 5 మండలాల నేతలకు అందజేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 27 Oct 2026 3:26 PM IST
Pathapatnam
X

Pathapatnam: మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా B-ఫారం పొందిన MLA MGR!

Pathapatnam: పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బీ-ఫారాలను అందుకున్నారు. ఆ తర్వాత పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాలైన పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్.ఎన్.పేట, కొత్తూరు మండలాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు బీ-ఫారాలను ఎమ్మెల్యే అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM