Pathapatnam: పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వండి!

Pathapatnam: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మహేంద్రతనయ నది ఉప్పొంగి పంట నష్టం. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 30 Oct 2026 1:08 PM IST
Pathapatnam
X

Pathapatnam: పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వండి!

Pathapatnam: ఆర్నాబ్ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా మహేంద్రతనయ నది ఉప్పొంగడంతో పాతపట్నం మండలం చంగుడి గ్రామం వద్ద నధీ పరివాహక ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో పంట నష్టం సంభవించింది.ఈ నేపథ్యంలో పంట నష్టానికి గురైన వ్యవసాయ పొలాలను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు రైతులతో కలిసి సందర్శించి, క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిస్థితులను పరిశీలించారు.

తుఫాన్‌ ప్రభావంతో నది ఉప్పొంగి పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులకు ఎదురైన నష్టాన్ని ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను పరిశీలిస్తూ, రైతులకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని, పంట నష్టానికి సంబంధించిన అంచనా నివేదికను వీలైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM