Pathapatnam: పాతపట్నంలో గాంధీ, శాస్త్రి జయంతులు: ఎమ్మెల్యే గోవిందరావు
Pathapatnam: పాతపట్నంలో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Pathapatnam: పాతపట్నంలో గాంధీ, శాస్త్రి జయంతులు: ఎమ్మెల్యే గోవిందరావు
Pathapatnam: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు.
గాంధీజీ చూపిన సత్యం–అహింసా మార్గం, లాల్ బహదూర్ శాస్త్రి గారి సరళత, నిజాయితీ, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని మామిడి గోవిందరావు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర్య సాధనలో అందించిన సేవలను, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
సత్యం, అహింస, శాంతి, సమానత్వం, నిజాయితీ, దేశభక్తి వంటి వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల అధ్యక్షుడు పగిలి బాబ్జి మరియు శాసనపురి మధుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




